సాధారణంగా పోటీల్లో పాల్గొనేవారంతా ప్రతిభను ప్రదర్శిస్తారు. అయితే అందులో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారు. ఓడినవారికి నిరాశ కలగడం సహజమే. వారు మరో సారి ప్రయత్నిద్దామనుకుని సర్దుకుపోతారు. కానీ, రాజస్థాన్ అజ్మేర్లోని కొందరు కండల వీరులు మాత్రం విజేతపై పీకల దాకా కోపం పెంచుకున్నారు. వేదికపైనే పిడిగుద్దులు కురిపించారు. వర్గాలుగా చీలిపోయి నానారభస సృష్టించారు.
కిసాన్గఢ్లో ఓ సేవా సంఘం నిర్వహించిన 'మిస్టర్ హీ మ్యాన్ ఆఫ్ అజ్మేర్' పోటీల్లో విజేతను ప్రకటించగానే మొదలైన ఘర్షణ చిన్నపాటి యుద్ధాన్నే తలపించింది. ఓటమిని భరించలేకనే కొందరు ఇలా హింసకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.