భారతీయ పురుషులతో పోల్చితే వైరస్ ముప్పు మహిళల్లోనే అధికమని తేల్చింది ఓ నివేదిక. వైరస్‌తో మరణించే ముప్పు భారతీయ మహిళలకు ఎక్కువగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు మృతి చెందిన వారి వివరాలు విశ్లేషించి ఈ అధ్యయనాన్ని బయటపెట్టింది. ఇన్సిటిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ అనే సంస్థ చేపట్టిన ఈ అధ్యయనం గ్లోబల్ హెల్త్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. మరణాలు, వ్యాధి సోకిన వారిలో ఎక్కువగా మహిళలు ఉన్నట్లు తేల్చింది. ఈ మేరకు మొత్తం మరణాల రేటు 2.9 శాతంగా ఉండగా.. మహిళల మరణాలు రేటు 3.3 శాతంగా ఉన్నట్లు చెప్పింది.
'భారతీయ మహిళలకు వైరస్ ముప్పు అధికం' - females in india
భారతీయ మహిళలకు కరోనా ముప్పు ఎక్కువని తేల్చింది ఓ నివేదిక. ఇప్పటివరకు మృతి చెందిన గణాంకాల ఆధారంగా ఈ వివరాలు ప్రకటించింది. ఈ మేరకు మొత్తం మరణాల రేటు 2.9 శాతంగా ఉండగా.. మహిళల మరణాలు రేటు 3.3 శాతంగా ఉన్నట్లు చెప్పింది.
'భారతీయ మహిళలకు వైరస్ ముప్పు అధికం'