తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాకి పగబట్టిందా? అందుకే దాడి చేస్తోందా? - kaithal

కాకి పగబట్టింది. ఓ వ్యక్తిని వెంటాడి, దాడి చేయడమే పనిగా పెట్టుకుంది. అతడు ఎక్కడికెళ్తే అక్కడికి వచ్చి విసిగిస్తోంది. ఎక్కడ? ఎందుకు?

కాకి పగబట్టిందా? అందుకే దాడి చేస్తోందా?

By

Published : Aug 28, 2019, 4:05 PM IST

Updated : Sep 28, 2019, 2:59 PM IST

కాకి పగబట్టిందా? అందుకే దాడి చేస్తోందా?

హరియాణా కైతల్​లో ఓ కాకి... బల్కార్​ సింహ అనే వ్యక్తిపై పగబట్టింది. వినడానికి హాస్యాస్పదంగా ఉన్నా... అతడి పరిస్థితి చూస్తే మాత్రం ఔననే అనిపిస్తోంది. రాజమౌళి సినిమాలో ఓ చిన్న ఈగ శత్రువును ముప్పతిప్పలు పెట్టగా.. నేనెందుకు చేయలేను అనుకుందో ఏమో ఈ దుకాణదారుడిని వెంటపడి మరీ వేధిస్తోంది.

కొన్ని రోజుల క్రితం గాయపడిన కాకి పిల్లకు బల్కార్​ చికిత్స చేసి, కాపాడాడు. కానీ ఆ కాకి తల్లికి ఆ వ్యక్తి కాపాడాడని తెలీదు. మరుసటి రోజు నుంచి అతడిని అనుసరించసాగింది. అప్పుడప్పుడు తలపై కోపంగా మొట్టికాయలు కూడా వేస్తోంది.

"ఓ రోజు ఆ కాకి పిల్ల నా దుకాణంలో పడిపోయింది. నేను దానికి చికిత్స చేసి ప్రాణాలు కాపాడాను. అప్పటి నుంచి ఈ కాకి నా వెంటపడుతోంది. నేనెక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తోంది. ఈ కాకి నన్ను ఇబ్బంది పెడుతోంది. ఎప్పుడుపడితే అప్పుడు నా తలపై మొట్టుతోంది."
-బల్కార్​, కైతల్ వాసి

ఇదీ చూడండి:పోలీసు పరీక్ష రాయడానికి వెళ్లి పట్టుబడ్డ దొంగ

Last Updated : Sep 28, 2019, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details