తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గంటలపాటు వేచి ఉన్నా.. పట్టించుకోలేదు: గవర్నర్​ - బంగాల్​ గవర్నర్​ వార్తలు

బంగాల్​ గవర్నర్​ జగ్​దీప్​ ధన్​కర్​ తనకు ఘోరమైన అవమానం జరిగిందని మీడియా ముఖంగా తెలిపారు. కొద్ది రోజుల క్రితం వెళ్లిన దుర్గాపూజా కార్నివాల్​లో... తనను నిర్వాహకులు కనీసం పట్టించుకోలేదన్నారు. ఎందుకు ఇలా చేశారో తనకు అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గంటలపాటు వేచి ఉన్నా.. పట్టించుకోలేదు: గవర్నర్​

By

Published : Oct 15, 2019, 5:33 PM IST

అక్టోబర్​ 11న జరిగిన దుర్గాపూజా కార్నివాల్​లో తనకు అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు బంగాల్​ గవర్నర్ జగ్​దీప్​ ధన్​కర్​. కార్యక్రమం కోసం ఆయనకు అందిన ఆహ్వానం, కేటాయించిన సీటు​ తదితర అంశాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వాహకుల చర్యతో తాను చాలా బాధపడ్డానన్నారు.

గంటలపాటు వేచి ఉన్నా.. పట్టించుకోలేదు: గవర్నర్​

"నాకు చాలా బాధకలిగించిన విషయం ఏంటంటే.. నన్ను చూసిన తీరు. నాలుగు గంటలకంటే ఎక్కువసేపు నేను అక్కడ వేచి ఉన్నాను. ఎన్నో లైవ్​ ఈవెంట్లు జరుగుతున్నా... నేను ఒక్కటి కూడా చూడలేకపోయాను. ఆ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. నన్ను కించపరచాల్సిన అవసరం ఏమొచ్చింది. రాష్ట్ర ప్రజలు ఎవరూ దీన్ని ఆమోదించరు. నేను బాధపడితే వారూ చింతిస్తారు. ఎవరు, ఎందుకు ఇలా చేశారో నాకు తెలియదు. ఈ విషయాన్ని వాళ్లైనా వివరించాలి.. లేక మీడియానే కనుగొనాలి."
- జగ్​దీప్​ ధన్​కర్, బంగాల్​ గవర్నర్

అయితే ఏ విషయం ఆయనను ఇంతలా బాధించిందో గవర్నర్​ స్పష్టంగా చెప్పలేదు. ఎన్ని అవరోధాలు కల్పించినా.. తనను బాధ్యతలు నిర్వర్తించకుండా ఎవరూ ఆపలేరన్నారు.

శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నిర్వాహకులు.. గవర్నర్​కు ఒక వరుసలో చివర సీటును కేటాయించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పలువురు మంత్రులు హాజరయ్యారు. బంగాల్​లో హింస చెలరేగుతోందంటూ కొద్ది రోజుల క్రితం గవర్నర్​ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది.

ABOUT THE AUTHOR

...view details