తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మెరుపు దాడి 3.0' భయాలతో పాక్​ గజగజ - uri attack news

జమ్ముకశ్మీర్​ హంద్వారా ఘటన అనంతరం భారత్​ ప్రతీకార దాడులకు దిగుతుందేమోనని పాకిస్థాన్ భయాందోళన చెందుతున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. భారత సైన్యం మరోసారి మెరుపు దాడులు నిర్వహిస్తుందేమోనని పాక్ సైన్యంలో కలవరం మొదలైనట్లు పేర్కొన్నాయి. అందుకే పొరుగు దేశం యుద్ధవిమానాలతో గస్తీని పెంచినట్లు వెల్లడించాయి.

Fearing retaliation after Handwara terror attack
'భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందేమోనని పాక్​లో భయం'

By

Published : May 10, 2020, 3:15 PM IST

మెరుపు దాడి... ఈ పేరు చెబితేనే వణికిపోతోంది పాకిస్థాన్. ఉరి, పుల్వామా ఘటనల అనంతరం పొరుగు దేశానికి ఆ స్థాయిలో బుద్ధి చెప్పింది భారత్. ఇప్పుడు అదే తరహాలో భారత్​ తమను చావు దెబ్బకొడుతుందని గజగజలాడుతోంది పాక్.

జమ్ముకశ్మీర్​ హంద్వారాలో ఉగ్రవాదులతో ఇటీవల జరిగిన భీకర ఎన్​కౌంటర్లో భారత సైన్యం కల్నల్ సహా ఐదుగురు జవాన్లను కోల్పోయింది.​ ఈ ఘటన అనంతరం మనం ఎలాంటి ప్రతీకార దాడులతో విరుచుకుపడతామోనని పాకిస్థాన్​లో భయం మొదలైందని అధికారిక వర్గాలు తెలిపాయి. పాక్ సైన్యం వారి భూభాగంలో యుద్ధవిమానాలతో పెట్రోలింగ్ కార్యకలాపాలను పెంచడమే ఇందుకు నిదర్శనమని చెప్పాయి. హంద్వాారా ఘటన జరిగిన సమయంలోనూ పాక్​ గగనతలంలో యుద్ధవిమానాలతో అభ్యాసాలు జరిగినట్లు తమ వద్ద పక్కా సమాచారం ఉందని వెల్లడించాయి.

'భారత సైన్యం కల్నల్ మృతి అనంతరం పాకిస్థాన్ సైన్యం ఎఫ్​-16ఎస్​, జేఎఫ్-17 యుద్ధవిమానాలతో పెట్రోలింగ్ కార్యకలాపాలు పెంచింది. మన నిఘా వర్గాలు నిరంతరం వీటిని గమనిస్తున్నాయి.'

-అధికారిక వర్గాలు.

మూల్యం చెల్లించక తప్పదు..

ఇటీవలి కాలంలో కశ్మీర్​లో అశాంతి నెలకొల్పాలని ఉగ్రవాద చొరబాట్లు ప్రోత్సహించడం సహా వరుసగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ సైన్యానికి కచ్చితంగా తగిన రీతిలో బుద్ధి చెబుతామని భారత సైన్యాధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సాధారణ పౌరులు, జవాన్ల ప్రాణాలను బలిగొంటున్న పాక్​ మూల్యం చెల్లించుకోక తప్పదని స్పష్టం చేశారు.

గతేడాది పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. అనంతరం పాక్​లోని బాలాకోట్​లో జైషే మహ్మద్​ ఉగ్రస్థావరంపై మెరుపు దాడులు నిర్వహించింది భారత సైన్యం. ఉగ్రవాద శిబిరాలను మట్టుబెట్టి చాపుదెబ్బకొట్టింది. 2016లో జరిగిన ఉరి ఘటన తర్వాత కూడా మెరుపు దాడులు చేసి బదులు తీర్చుకుంది.

ABOUT THE AUTHOR

...view details