48 ఏళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన హబీబర్ అనే వృద్ధుడు.. ఫేస్బుక్ పుణ్యమా అని తిరిగి తన కుటుంబసభ్యులను కలుసుకున్నాడు. బంగ్లాదేశ్ బజ్గ్రామ్లో ఇనుప కడ్డీలు, సిమెంట్ వ్యాపారం చేసుకునే హబీబర్.. 30 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం ఇల్లు వదిలి వెళ్లాడు.. అయితే ఏళ్లు గడిచినా.. తిరిగి ఇంటికి రాకపోయేసరికి.. కంగారు పడిన కుటుంబసభ్యలు ఆయన కోసం వెతకని చోటంటూ లేదు. కానీ, ఫలితం మాత్రం లేకపోయింది.
ఒక్క వీడియోతో ఒక్కటయ్యే..
అయితే, ఇటీవల ఓ వృద్ధుడి చికిత్సకు ఆర్థిక సాయం కోరుతూ.. వీడియో పోస్ట్ చేశాడు అమెరికాకు చెందిన ఓ వ్యక్తి. ఆ వీడియోను చూసిన హబీబర్ పెద్ద కుమారుడి భార్యకు.. ఆ ఆసుపత్రిలో ఉన్నది తన మామయ్యే అయ్యి ఉంటాడని అనుమానం వచ్చింది. వెంటనే ఈ వీడియో గురించి కుటుంబసభ్యలతో పంచుకుంది.
ఈ వీడియో చూసిన హబీబర్ కుమారులు ఆసుపత్రికి వెళ్లారు. ఇంకేముంది హబీబర్ కోడలి అనుమానం నిజమైంది.. చికిత్స పొందుతున్న వ్యక్తి మరెవరో కాదు వారి తండ్రే అని తెలిసింది.