తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం - యూపీ రేప్ కేసు

ఉత్తర్​ప్రదేశ్​ హర్దోయీలో నాలుగేళ్ల కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుచెప్పిన భార్యను చంపేస్తానని బెదిరించాడు. భర్త ఇంట్లో లేని సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

up rape case
నాలుగేళ్ల కూతురిపై కసాయి తండ్రి అత్యాచారం

By

Published : Oct 9, 2020, 9:49 PM IST

Updated : Oct 10, 2020, 5:38 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ హర్దోయీ జిల్లాలోని కాసీంపుర్​లో దారుణం జరిగింది. నాలుగేళ్ల కూతురిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. బయటినుంచి వచ్చి అతని భార్య అడ్డగించగా.. ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు.

ఆ తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్లాక.. పోలీసులకు సమాచారం ఇచ్చింది అతని భార్య. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. బాలికను ఆసుపత్రిలో చేర్చారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.

మరోచోట లైంగికదాడి..

మధ్యప్రదేశ్​ సెహోర్ జిల్లాలోని జవార్ పోలీస్ స్టేషన్ పరిధిలో అడవిలో కట్టెల కోసం వెళ్లిన మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి:40రోజుల పసికందును గొంతు కోసి చంపిన తల్లి

Last Updated : Oct 10, 2020, 5:38 AM IST

ABOUT THE AUTHOR

...view details