తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎత్తుకోవాల్సిన తండ్రే కన్న బిడ్డను విసిరేస్తే... - Father thrown on the cot

ఫాదర్స్​ డే అని ఓ వైపు గొప్పగా సంబరాలు జరుపుకుంటుంటే.. దానికి విలువ లేకుండా చేశాడో తండ్రి. లాలించి, బుజ్జగించాల్సిన ఆ చేతులతో.. కన్న కూతురని చూడకుండా కొట్టి, మంచం పైనుంచి విసిరేశాడు. రెండు నెలలైనా నిండని ఆ పసిపాప.. ఇప్పుడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.

Father arrested for throwing 54-day-old baby ; baby in critical condition
ఎత్తుకోవాల్సిన తండ్రే కన్న బిడ్డను విసిరేస్తే...

By

Published : Jun 21, 2020, 7:50 PM IST

నాన్నల దినోత్సవం నాడే సమాజం తలదించుకునే పని చేశాడో వ్యక్తి. ఏడిస్తే బుజ్జగించి, తన చేతులతో ఆ చిన్నారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఆ తండ్రే కిరాతకుడయ్యాడు. ఎత్తుకొని లాలించడం మానేసి.. దారుణంగా కొట్టి మంచం పైనుంచి విసిరేశాడు. కేరళలోని అంగమల్​లో జరిగిన ఈ ఘటనలో.. 54 రోజుల ఆ పాపాయి క్లిష్ట పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

బిడ్డను కొట్టిన తండ్రి షైజూ థామస్​.. తాను కొట్టలేదని, కిందపడి గాయాలయ్యాయని బుకాయించాడు. నిందితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టగా.. అతడే కొట్టినట్లు తేలింది.

మద్యం సేవించినప్పుడు క్షణికావేశానికి గురై థామస్ ఇలా ప్రవర్తిస్తుంటాడని పోలీసులు తెలిపారు.

నిందితుడు షైజూ థామస్​

గతంలోనూ ఇలాగే రెండుసార్లు ఆ చిన్నారిని మంచం పైనుంచి తోసేశాడని థామస్​ భార్య చెప్పింది.

ఇదీ చదవండి:20 హత్యల సైనైడ్​ మోహన్​కు బుధవారం శిక్ష!

ABOUT THE AUTHOR

...view details