తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. విల్లుపురం సమీపంలో టెంపో, బస్సు ఢీకొని 10 మంది మృతిచెందారు.
ప్రమాద సమయంలో టెంపోలో 14 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 11 మంది ఉత్తర భారతదేశానికి చెందిన వారే. 26 మంది ప్రయాణికులతో కోవై నుంచి చెన్నై వెళ్తున్న బస్సును ఈ టెంపో ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో టెంపోలోని ఏడుగురు ప్రయాణికులు, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.