తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్​ వ్యర్థాల దుస్తులతో నయా ఫ్యాషన్​ షో - plastic waste management awareness program

ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఓ ఎన్​జీఓ సంస్థ వినూత్న ప్రయత్నం చేసింది. మహారాష్ట్ర పుణెలో.. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారుచేసిన దుస్తులతో ఫ్యాషన్​షో నిర్వహించింది. ఈ ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకట్టుకుంది.

fashion show waste plastic costumes
ప్లాస్టిక్​ వ్యర్థాల దుస్తులతో మోడళ్ల హొయలు

By

Published : Dec 3, 2019, 9:39 AM IST

Updated : Dec 3, 2019, 11:48 AM IST

ప్లాస్టిక్​ వ్యర్థాల దుస్తులతో నయా ఫ్యాషన్​ షో

ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారుచేసిన దుస్తులతో మహారాష్ట్ర పుణెలో ఓ వినూత్న ఫ్యాషన్ షో నిర్వహించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపదర్శినిలు (మోడళ్లు) ఈ ప్రదర్శన చేశారు.

ప్లాస్టిక్ పునర్వినియోగం

ఈ ఫ్యాషన్​ షోలో రూపదర్శినిలు ప్లాస్టిక్ సీసాలు, శానిటరీ ప్యాడ్లు, పునర్వినియోగ ప్లాస్టిక్ వ్యర్థపదార్థాలతో తయారుచేసిన దుస్తులను ఉపయోగించారు. ప్లాస్టిక్ పునర్వినియోగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహించారు.

'ఎన్​జీఓ'

పుణె మున్సిపల్ కార్పొరేషన్​, రహదారి కాలుష్య బోర్డు సహకారంతో 'మై ఎర్త్​ ఫౌండేషన్'​ అనే ఎన్​జీఓ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వనరాయ్​ ఇన్​స్టిట్యూట్​, దీపాలి సయ్యద్​ ఫౌండేషన్​ దీనికి సహకారం అందించాయి.

ఇదీ చూడండి:లైంగిక దాడుల కేసుల్లో ఏం చేస్తున్నారు?: ఎన్​హెచ్​ఆర్​సీ

Last Updated : Dec 3, 2019, 11:48 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details