కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఎమ్మెల్యే ఎంసీ కమరుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై చీటింగ్ కేసులు నమోదవ్వడం వల్ల శనివారం కేరళలోని కాసరగోడ్ క్రైం బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుకు ముందు దాదాపు ఐదు గంటల పాటు ఆయన్ని విచారించారు. అరెస్టు అనంతరం సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఫ్యాషన్ గోల్డ్ జ్యూవెలరీ గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్న కమరుద్దీన్ కోట్లాది రూపాయల మేర ఇన్వెస్టర్లను మోసం చేశారంటూ పలు చోట్ల ఆయనపై కేసులు నమోదయ్యాయి. పెట్టుబడిదారులు తమ వాటాలను చెల్లించినప్పటికీ.. తిరిగి వారికి డబ్బులు ఇవ్వడంలో కంపెనీ విఫలమైందని ఆరోపిస్తూ ఆయనపై కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.