జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను ప్రభుత్వం అరెస్టు చేయలేదని లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్షా వెల్లడించారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఇష్టపూర్వకంగానే తన నివాసంలో ఉన్నారని షా వివరించారు.
లోక్సభలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత సుప్రియా సులే చేసిన వ్యాఖ్యలకు సమాధానంగా షా ఈ విధంగా స్పందించారు. తన పక్కన ఫరూక్ అబ్దుల్లా కూర్చునే వారని, ప్రస్తుతం సభలో ఆయన లేరని సుప్రియ వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం లోక్సభలో ఆర్టికల్ 370పై వాడీ-వేడీ చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఫరూక్ లేకపోతే.. అసలు చర్చే అసంపూర్ణంగా మిగిలిపోతుందని సుప్రియా సులే అభిప్రాయపడ్డారు.