జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) కుంభకోణం కేసులో నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) పార్టీ అధ్యక్షడు ఫరూక్ అబ్దుల్లా... ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఫరూక్‌ను ఆరు గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. ఫరూక్... ఈడీ ఎదుట హాజరు కావడం ఈ వారంలో రెండోసారి.
జేకేసీఏ కుంభకోణం కేసులో ఈడీ ఎదుట హాజరైన ఫరూక్ - Farooq Abdullah
మనీలాండరింగ్ కేసులో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా... ఎన్స్ఫోర్సమెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట హాజరయ్యారు. ఆరు గంటలపాటు విచారించింది ఈడీ అధికారులు.

జేకేసీఏ కుంభకోణం కేసులో ఈడీ ముందు హాజరైన ఫరూక్
ఫరూక్... జేకేసీఏకు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రూ. 43.69 కోట్లు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణతో ఫరూక్ సహా పలువురిపై 2018లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ మేరకే రంగంలోకి దిగిన ఈడీ... 2019 జులైలో ఫరూక్‌ను తొలిసారి ప్రశ్నించింది.