ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టి.. కేంద్రానికి గట్టి సందేశాన్ని పంపారు అన్నదాతలు. దిల్లీ సరిహద్దుల్లో రహదారులపైనే కూర్చిని దీక్ష చేసి.. నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం దిగిరావాల్సిందేనని తేల్చిచెప్పారు. అప్పటివరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.
టిక్రీ, ఘాజీపుర్ సహా పలుచోట్ల దీక్షలు చేపట్టారు అన్నదాతలు. రైతులకు మద్దతుగా వారి కుటుంబసభ్యులు కూడా దీక్షలో కూర్చున్నారు. దీక్ష ముగిసిన అనంతరం మంచినీరు, పళ్లు తీసుకున్నారు.