సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలను మరింత ఉద్ధృతం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్లు స్వరాజ్ ఇండియా సారథి యోగేంద్ర యాదవ్ ప్రకటించారు. 11మంది సభ్యుల బృందంలో సింఘు సిరిహద్దులో ఈ దీక్షను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈనెల 23న 'కిసాన్ దివస్' సందర్భంగా రైతులకు మద్దతుగా ప్రజలు ఒక్కపూట ఉపవాసం ఉండాలని మరో నేత రాకేశ్ తైకైత్ కోరారు.
ఈనెల 25 నుంచి 27 వరకు హరియాణాలో టోల్గేట్ల వద్ద రుసుముల వసూలును అడ్డుకోనున్నట్లు రైతు సంఘం నాయకుడు జగ్జీత్ సింగ్ దలేవాలా తెలిపారు. ఈనెల 27న ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడినంత సేపు ప్రజలంతా పళ్లాలు మోగించి చప్పుళ్లు చేయాలని అభ్యర్థించారు.