అన్నదాత ఆందోళన- దిగ్బంధంలోనే రహదారులు - delhi farmers protest
10:47 January 04
దిల్లీ సరిహద్దులో నిరసనల కారణంగా గాజియాబాద్, నోయిడా నుంచి రాజధానికి వెళ్లే రహదారులు దిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. చిల్లా సరిహద్దు పాక్షికంగా మూసుకుపోయి ఉందని పోలీసులు తెలిపారు. దిల్లీ వచ్చే ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. ఆనంద్ విహార్, డీఎన్డీ, భోప్రా, లోని సరిహద్దుల నుంచి రావాలని తెలిపారు.
40 రోజులుగా దిల్లీ సరిహద్దులోనే ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో.. దిల్లీ ట్రాఫిక్ పోలీసు విభాగం ట్విట్టర్ ద్వారా ప్రయాణికులను అప్రమత్తం చేస్తోంది. సింఘు, ఔచందీ, మనియారీ, సబోలీ, మంగేశ్ సరిహద్దులు మూతపడి ఉన్నాయని సోమవారం ట్వీట్ చేసింది. ఝటికరా సరిహద్దు.. కార్లు, ద్విచక్రవాహనాలకు మాత్రమే తెరిచి ఉందని వెల్లడించింది. హరియాణాకు వెళ్లేవారు ఝరోడా, దౌరాల, కాపషేరా, బదుసరాయ్, రాజోక్రి, పాలం విహార్, దండహేరా మార్గాల ద్వారా ప్రయాణించాలని సూచించింది.