రైతు సంఘాలను మరోమారు చర్చలకు ఆహ్వానించింది కేంద్రం. తేదీ నిర్ణయించాలని సూచించింది. ఈ మేరకు అన్నదాతలకు లేఖ రాసింది.
రైతులను మరోమారు చర్చలకు ఆహ్వానించిన కేంద్రం - New farm laws
23:37 December 20
20:41 December 20
అమృత్‌సర్‌లో రైతల కొవ్వత్తుల ర్యాలీ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతోన్న ఆందోళనల్లో పాల్గొంటూ అమరులైన రైతులకు నివాళులర్పించింది పంజాబ్‌కు చెందిన కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ. ఈ మేరకు అమృత్‌సర్‌లో కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు సంఘర్ష్ కమిటీ సభ్యులు. రైతులకు శ్రద్ధాంజలి ఘటించారు.
18:04 December 20
సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న నిరసనలను మరింత ఉద్ధృతం చేసేందుకు రైతులు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నట్లు స్వరాజ్ ఇండియా సారథి యోగేంద్ర యాదవ్ ప్రకటించారు.
ఈనెల 23న రైతులకు మద్దతుగా ప్రజలు ఒక్కపూట ఉపవాసం ఉండాలని రైతుల సంఘాల నేతలు కోరారు. ఈనెల 25 నుంచి 27 వరకు హరియాణాలో టోల్ రుసుము వసూలును అడ్డుకోనున్నట్లు రైతు సంఘాల నేత జగ్జీత్ సింగ్ దలేవాలా తెలిపారు. ఈనెల 27న ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడినంత సేపు ప్రజలంతా పళ్లాలు మోగించాలని అభ్యర్థించారు.
15:41 December 20
నిరంకారి మైదానంలో రైతుల ర్యాలీ
బురారీలోని నిరాంకారీ సమగమ్ మైదానంలో ఆందోళనలు చేపడుతోన్న రైతులు...ర్యాలీ నిర్వహించి రైతు అమరవీరులకు నివాళులర్పించారు. నిరసనలు జరుగుతున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయిన కర్షకులకు దేశవ్యాప్తంగా ఉన్న రైతులంతా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని తెలిపారు.
14:15 December 20
అన్నదాతల చలో దిల్లీ..
ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌లోని రైతులు, హింద్ మజదూర్ కిసాన్ సమితి సభ్యులు.. భారీ సంఖ్యల్లో దిల్లీ సరిహద్దులోని ఘజియాబాద్‌కు తరలివెళుతున్నారు. వారి ప్రయాణం వల్ల.. సమీప రోడ్లన్నీ ట్రాక్టర్లు, కార్లతో నిండిపోయాయి. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన నిరసనలకు తమ మద్దతుంటుందని స్పష్టం చేశారు.
13:01 December 20
అప్పటివరకు పోరాటమే..
- మధ్యాహ్నం 2 గంటలకు సింఘు సరిహద్దుల్లో రైతు సంఘాల భేటీ
- సుప్రీంకోర్టు కమిటీ ప్రతిపాదన, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్న రైతు సంఘాలు
- సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశం ద్వారా నిర్ణయాలు వెల్లడించనున్న రైతు సంఘాలు
- అమరులైన రైతులకు నివాళులు అర్పించిన రైతు సంఘాలు, రైతులు
- చలో దిల్లీకి పిలుపు తర్వాత పలు కారణాలతో 33 మంది రైతులు మృతి
- ఆందోళనల్లో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు శ్రద్ధాంజలి
- శ్రద్ధాంజలి దివస్ పేరుతో దిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన
- సింఘు, టిక్రి, ఘాజిపూర్ వద్ద రైతు సంఘాల నేతలు, రైతుల సంతాపం
- దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలకు పిలుపు
- డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామన్న రైతు సంఘాలు
11:58 December 20
శ్రద్ధాంజలి దివస్..
- రైతు అమరవీరులకు నివాళులు అర్పించిన రైతు సంఘాలు
- చలో దిల్లీకి పిలుపు తర్వాత పలు కారణాలతో 33 మంది రైతులు మృతి
- ఆందోళనల్లో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోయిన రైతులకు శ్రద్ధాంజలి
- శ్రద్ధాంజలి దివస్ పేరుతో దిల్లీ సరిహద్దులో కొనసాగుతున్న రైతుల ఆందోళన
- సింఘు, టిక్రి, ఘాజిపూర్ వద్ద రైతు సంఘాల నేతలు, రైతుల సంతాపం
- దేశవ్యాప్తంగా లక్షకు పైగా గ్రామాల్లో సంతాప సమావేశాలు, మానవహారాలకు పిలుపు
- డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం తీవ్రతరం చేస్తామన్న రైతు సంఘాలు
09:08 December 20
అన్నదాతకు మద్దతు
దిల్లీలో ఆందోళనలు చేపట్టిన రైత్నలకు దేశ నలుమూలల నుంచి మద్దతు లభిస్తోంది. ముఖ్యంగా పంజాబ్ వాసులు రైతుల కోసం దిల్లీకి తరలివెళుతున్నారు. తాజాగా.. పంజాబ్‌లోని వివిధ అసుపత్రులకు చెందిన వైద్యుల బృందం సింఘూ సరిహద్దుకు చేరుకుంది. అన్నదాతలకు తాము మద్దతివ్వడానికి వచ్చినట్టు.. ఎవరైనా అనారోగ్యం పాలైతే చికిత్స కూడా అందించనున్నట్టు లుథియానాకు చెందిన ఓ నర్సు పేర్కొన్నారు.
08:57 December 20
షాహిది దివాస్
దిల్లీలో రైతుల నిరసనలు 25వ రోజుకు చేరుకున్నాయి. కాగా ఈరోజును "షాహిది దివాస్‌గా" పాటిస్తున్నట్టు రైతులు వెల్లడించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా అమరులైన అన్నదాతలకు నివాళులర్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత కిసాన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి త్యాగి వెల్లడించారు.