తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ బిల్లుల ఆమోదంపై రైతన్న ఆగ్రహం

వ్యవసాయ బిల్లులపై ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం.. రైతుల ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని నిరసనకారులు విమర్శించారు. పలు చోట్ల రాస్తారోకోలు చేపట్టారు. హరియాణాలో రోడ్లను దిగ్బంధించి రైతులు నిరసనకు దిగారు.

Farmers protest new agriculture law by blocking major road in Sirsa
ఆ బిల్లుల ఆమోదంపై రైతుల ఆగ్రహం.. పలు చోట్ల నిరసనలు

By

Published : Sep 20, 2020, 3:44 PM IST

Updated : Sep 20, 2020, 4:28 PM IST

కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హరియాణాలోని రైతులు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సిర్సా వద్ద జాతీయ రహదారిని దిగ్బంధించి.. ధర్నాకు దిగారు.

రోడ్డుపై బైఠాయించిన రైతులు
రైతుల ధర్నాతో గందరగోళం

ప్రైవేటు కొనుగోలుదారులు.. వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధర కంటే తక్కువకు సేకరించడం శిక్షార్హమైనదిగా ప్రభుత్వం చట్టాలను రూపొందించాలని డిమాండ్​ చేస్తున్నారు నిరసనకారులు. అదే తమకు భరోసా కల్పిస్తుందని అంటున్నారు.

రోడ్డును దిగ్బంధించి నిరసన
భారీగా మోహరించిన పోలీసులు

అంబాలాలోని సాదోపుర్​ సరిహద్దు వద్ద ఆందోళనకు దిగిన రైతులను చెదరగొట్టేందుకు జలఫిరంగులు ప్రయోగించారు పోలీసులు. నిరసనకారులు వెనక్కితగ్గకపోగా... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నిరసనలు చేస్తున్న రైతులపై జలఫిరంగుల ప్రయోగం
అంబాలాలో రైతుల ధర్నా
రైతులపై వాటర్​ కెనాన్ల ప్రయోగం

పంజాబ్‌లో యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రైతులు జిరాక్​పుర్​ నుంచి దిల్లీ వరకు ట్రాక్టర్‌ ర్యాలీని చేపట్టారు.

పంజాబ్​లో ట్రాక్టర్​ ర్యాలీ
ర్యాలీగా బయల్దేరిన ట్రాక్టర్లు
Last Updated : Sep 20, 2020, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details