చెన్నైలో డీఎంకే నిరసన..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచింది డీఎంకే పార్టీ. వారికి సంఘీభావంగా చెన్నైలో డీఎంకే, ఆ పార్టీ మిత్రపక్షాలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సహా పలువురు నేతలు దీక్షలో పాల్గొన్నారు.
నిరసన చేస్తున్న రైతులను జాతి వ్యతిరేకులుగా కేంద్రం పేర్కొనడాన్ని స్టాలిన్ ఖండించారు. రైతులకు తాము మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు.