తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోమవారం రైతు సంఘాల నేతల నిరాహార దీక్ష - Farmers' protest at Singhu (Delhi-Haryana border) enters 18th day.

Farmers' protest at Singhu (Delhi-Haryana border) enters 18th day.
సింఘు సరిహద్దులో 18వ రోజుకు చేరిన రైతుల ఆందోళనలు

By

Published : Dec 13, 2020, 10:34 AM IST

Updated : Dec 13, 2020, 5:57 PM IST

17:56 December 13

రైతుల మద్దతు- తోమర్​ కృతజ్ఞతలు..

  • కొత్త చట్టాలకు కొన్ని రైతుసంఘాలు మద్దతిస్తున్నాయి: కేంద్రమంత్రి తోమర్‌
  • ఉత్తరాఖండ్ రైతులు నన్ను కలిశారు, కొత్త చట్టాలకు మద్దతు తెలిపారు: తోమర్‌
  • కొత్త చట్టాలను అర్థం చేసుకున్న ఉత్తరాఖండ్ రైతులకు కృతజ్ఞతలు: తోమర్‌
  • కొత్త సాగు చట్టాలకు మద్దతిచ్చే సంఘాలు, నేతలకు కృతజ్ఞతలు: తోమర్‌

17:27 December 13

సోమవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేయనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. దేశంలోని ప్రతి జిల్లా ప్రధాన కేంద్రంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కొత్త సాగు చట్టాల రద్దును అన్ని సంఘాలు కోరుతున్నాయని పేర్కొన్నారు. రైతుసంఘాలన్నీ కలిసే రేపు ఉద్యమం చేయనున్నట్లు స్పష్టం చేశారు. 

17:01 December 13

ఉత్తరాఖండ్​కు చెందిన రైతులు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ను దిల్లీలో కలిశారు. మూడు వ్యవసాయ చట్టాలను తాము సమర్థిస్తున్నట్లు తెలిపారు. 

మూడు చట్టాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు నిరసనలు చేపడుతున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

16:56 December 13

వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలన్న డిమాండ్​తో ఆందోళనలు చేపడుతున్న రైతులకు మద్దతుగా సోమవారం నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆప్​ కార్యకర్తలంతా తనతో కలిసి దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. "కేంద్రం అహంకారాన్ని వీడి తక్షణమే మూడు చట్టాలు రద్దు చేయాలి. రైతుల డిమాండ్లు అన్నింటికీ అంగీకరించాలి" అని సూచించారు కేజ్రీవాల్.

14:55 December 13

షాతో వ్యవసాయ శాఖ మంత్రులు భేటీ..

  • అమిత్ షాతో కేంద్రమంత్రులు తోమర్, సోమప్రకాష్ భేటీ
  • రైతుల ఆందోళనపై చర్చిస్తున్న కేంద్రమంత్రులు

13:17 December 13

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఆందోళనలు చేస్తున్న రైతులకు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. అన్నదాతల నిరసనకు మద్దతుగా పంజాబ్​ డీఐజీ(జైళ్లు) లక్మీందర్​ సింగ్​ తన పదవికి రాజీనామా చేశారు. ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్నట్లు భావించాలని కోరుతూ పంజాబ్ ప్రభుత్వ కార్యదర్శికి లేఖ పంపారు.  రైతులకు సంఘీభావంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

10:25 December 13

రైతుల ఆందోళనలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు 18వ రోజుకు చేరుకున్నాయి. దిల్లీ-హరియాణా సరిహద్దు ప్రాంతం సింఘులో ఎముకలు కొరికేచలిలోనూ నిరసన వ్యక్తం చేస్తున్నారు రైతులు. నూతన సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలను మరింత ఉద్ధృతం చేసేందుకు డిసెంబర్​ 14న సింఘు సరిహద్దులో నిరహార దీక్ష చేపడతామని రైతు సంఘాల నాయకులు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే డిసెంబర్​19న ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని హెచ్చరించారు.

Last Updated : Dec 13, 2020, 5:57 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details