కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, భూ సంస్కరణల ఆర్డినెస్స్, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ(ఏపీఎంసీ) సవరణలు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటక రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) సహా ఇతర సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. రోడ్లపై ఆందోళనలు నిర్వహించాయి.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళనలు - రైతుల ఆందోళనలు
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో బంద్ నిర్వహిస్తున్నాయి రైతు సంఘాలు. రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చెపడుతున్నాయి. బైక్ ర్యాలీలు నిర్వహించాయి. పలు చోట్ల బ్యానర్లు ప్రదర్శిస్తూ ఆందోళనలకు దిగాయి.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కర్ణాటకలో ఆందోళనలు
ఆందోళనలలో భాగంగా బైక్ ర్యాలీలు నిర్వహించాయి రైతు సంఘాలు. పలు చోట్లు రోడ్లపై బైఠాయించి కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. దుకాణాలు తెరిచిన యజమానుల వద్దకు వెళ్లి బంద్కు మద్దతు తెలుపాలని కోరారు.
రాష్ట్ర బంద్ నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా ముందు జాగ్రత చర్యలు తీసుకున్నారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.