తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైతులారా.. చర్చలతోనే సమస్యకు పరిష్కారం' - ప్రభుత్వ పనితీరుపై అమరీందర్​ స్పందన

అన్నదాతల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పంజాబ్​ సీఎం​ అమరీందర్​ సింగ్​ ఆరోపించారు. తొలి రౌండ్లో  సద్దుమణగాల్సిన సమస్యను ప్రభుత్వం 12 రౌండ్ల చర్చల వరకూ పొడిగించిందని.. అయినా ఇప్పటివరకు దానికి పరిష్కారం లేదన్నారు. దేశ స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలిచే ఎర్రకోటలో రైతు ఉద్యమంతో హింసను ప్రేరేపించడంపై.. తాను తీవ్ర ఆవేదన చెందినట్టు చెప్పారు అమరీందర్​.

Farmers must go to meetings with government, issue must be resolved: Capt Amarinder Singh
రైతులు.. ప్రభుత్వంతో చర్చకు వెళ్తేనే సమస్యకు పరిష్కారం!

By

Published : Jan 30, 2021, 9:26 AM IST

రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం విఫలమైందని అమరీందర్​ అన్నారు. ఎప్పుడో పరిష్కరించాల్సిన సమస్యను మరింత ఆలస్యం చేస్తూ.. 12 రౌండ్ల చర్చల వరకూ తీసుకెళ్లిందని ఆరోపించారు. మొదటి దఫా చర్చల్లోనే రైతుల డిమాండ్​లకు ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా రైతులు.. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లి నూతన సాగు చట్టాలపై సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు.

'అది పాక్​ కుట్రే!'

కొందరు వ్యక్తులు రైతు ఉద్యమంలోకి ప్రవేశించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట, దిల్లీ పరిసర ప్రాంతాల్లో హింసకు కారకులయ్యారని పంజాబ్​ ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఆందోళనల కారణంగా రైతు ఉద్యమం.. ఉనికి కోల్పోయిందని చెప్పారు. దేశంలో అవాంతరాలు సృష్టించేందుకు పాక్​ కుట్ర పన్నుతోందని ఓ మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు అమరీందర్​. దేశ స్వతంత్రానికి, ప్రజాస్వామ్యానికి ఎర్రకోట ప్రతీకగా నిలుస్తుందన్న ఆయన.. జనవరి 26న జరిగిన హింసాకాండ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి చెందానని చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు బాధ్యత వహించాలని తెలిపారు.

ఆ 'స్థానికులు' ఎవరో తేల్చండి..

దిల్లీ శివారులోని సింఘు సరిహద్దులో శుక్రవారం పటిష్ఠంగా ఉన్న భద్రతను సైతం దాటడుకొని రైతులపైన, వారి ఆస్తులపైన దాడులు చేసిన 'స్థానికులు' ఎవరో విచారణ ద్వారా కేంద్ర ప్రభుత్వం తేల్చాలని పంజాబ్​ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ కోరారు. స్థానిక ప్రజలు.. రైతులపై తిరగబడతారంటే తాను నమ్మబోమని అన్నారు. వాళ్లు కచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని, స్థానికులైతే రైతులను ద్రోహులుగా పిలవరని చెప్పారు అమరీందర్​. రైతు చట్టాలపై జరుగుతున్న ఈ ఆందోళనలు అడ్డుపెట్టుకుని పంజాబ్​లో శాంతిని భంగపరిచేందుకు పాకిస్థాన్​ ఎదురుచూస్తోందని తాను చాలాకాలంగా హెచ్చరిస్తున్నట్టు​ తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్​ షాతో భేటీ అయినప్పుడు కూడా ఇదే విషయమై తాను మాట్లాడినట్టు ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి:దిల్లీలో మరోసారి రైతుల నిరాహార దీక్ష

ABOUT THE AUTHOR

...view details