తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైతుల ఆదాయం కిందకు​- మోదీ దోస్తుల ఆస్తి పైపైకి'

'సూటు-బూటు సర్కారు' పాలనలో రైతుల ఆదాయం సగానికి పడిపోగా... ప్రభుత్వ మిత్రుల సంపద నాలుగు రెట్లు పెరిగిందని ఆరోపించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాందీ. అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వం... వారిని దోచుకుందని ధ్వజమెత్తారు రాహుల్.

Farmers' income has halved while that of govt's friends has risen: Rahul takes dig at Centre
'మోదీ హయాంలోనే​ రైతుల ఆదాయానికి గండి'

By

Published : Dec 2, 2020, 3:59 PM IST

కేంద్రంపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. రైతులను దోచుకొని తన మిత్రులకు పెట్టిందని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు​. కార్పొరేట్లకు మేలు చేసే పాలనలో రైతుల ఆదాయం సగానికి పడిపోగా... ఆ సమయంలోనే ప్రభుత్వ పెద్దల స్నేహితుల ఆదాయం నాలుగు రెట్లు పెరిగిందని ట్విట్టర్​ వేదికగా దుయ్యబట్టారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో వారం రోజులుగా రైతులు ముమ్మరంగా నిరసనలు చేస్తున్న నేపథ్యంలో రాహుల్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీ ప్రభుత్వం అబద్ధాల కోరని.. రైతులను ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వమే వారిని దోచుకుందని తీవ్రంగా ఆరోపించారు రాహుల్.

మరోవైపు.. రైతుల నిరసనల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును తప్పుబట్టింది కాంగ్రెస్​. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, ఆందోళనకారుల మనోవేదనను వినాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది​.

ఇదీ చూడండి:అమిత్‌ షా నివాసంలో మంత్రుల భేటీ-ఆందోళనపై చర్చ

ABOUT THE AUTHOR

...view details