తెలంగాణ

telangana

వ్యవసాయ ఆర్డినెన్స్​లపై హరియాణా రైతుల ఆగ్రహం

By

Published : Sep 10, 2020, 3:15 PM IST

హరియాణా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర రైతులు నిరసనకు దిగారు. రాష్ట్ర కేబినెట్​ ఆమోద ముద్ర వేసిన మూడు వ్యవసాయ ఆర్డినెన్స్​లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుక్షేత్ర వద్ద 44వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు.

Farmers in Kurukshetra protest against the three recent agriculture ordinances passed by the Union Cabinet.
వ్యవసాయ ఆర్డినెన్స్​లపై రైతన్న ఆగ్రహం

హరియాణాలో రైతులు కన్నెర్ర చేశారు. రాష్ట్ర కేబినెట్​ ఇటీవలే ఆమోదించిన మూడు వ్యవసాయ ఆర్డినెన్స్​లకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు. భారీ సంఖ్యలో తరలివెళ్లి.. కురుక్షేత్రం వద్ద ఉన్న 44వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు.

రోడ్లపైకి వచ్చిన రైతులు
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ...

ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రహదారులు హోరెత్తాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

జాతీయ రహదారి దిగ్బంధం
రంగంలోకి దిగిన పోలీసులు

ఇదీ చూడండి:-'ప్రభుత్వ విధానాలతోనే కోట్లాది ఉద్యోగాలు మాయం'

ABOUT THE AUTHOR

...view details