కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. దిల్లీలోని గురుద్వారా రకాబ్గంజ్లో సమావేశమైన 200 రైతు సంఘాల ప్రతినిధులు ఈ మేరకు నిర్ణయించారు.
దేశవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాల పిలుపు - Farmer protests latest news
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి రైతు సంఘాలు. నవంబర్ 5న జాతీయ రహదారుల దిగ్భంధం సహా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రైతు సంఘాలు నిర్ణయించాయి.
![దేశవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాల పిలుపు farmers call for nationwide protests against new agri laws](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9330330-thumbnail-3x2-farmers.jpg)
దేశవ్యాప్త ఆందోళనకు రైతు సంఘాల పిలుపు
నవంబర్ 5న మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అన్ని జాతీయ రహదారుల దిగ్భంధం సహా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని రైతులు పిలుపునిచ్చారు. నవంబర్ 26, 27 తేదీల్లో ఛలో దిల్లీ ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నారు.
ఇదీ చూడండి:ఆత్మగౌరవంతో పేదవారు రాజీపడరు: ప్రధాని