భూసేకరణ సవరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వాలని రాజస్థాన్ జైపుర్ జిల్లా నిందర్లో 21 మంది రైతులు తమ శరీరాలను మెడవరకు పాతిపెట్టుకుని నిరసన తెలుపుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆదివారం నుంచి ఇదే విధంగా ఆందోళన చేస్తున్నారు.
రైతుల భూముల్లో గృహ నిర్మాణ పథకం చేపట్టడం కోసం 13వందల బీగాల భూమిని జైపుర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ(జేడీఏ) సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో సరైన పరిహారం కోసం ఉద్యమిస్తున్నారు నిర్వాసితులు. గత జనవరిలోనూ నాలుగు రోజులపాటు ఇదే విధంగా నిరసన వ్యక్తం చేశారు.
"నూతన భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం ఇవ్వాలి. దీని ద్వారా రైతులకు లాభం చేకూరుతుంది. చట్టానికి అనుగుణంగా పరిహారం ఇస్తే సంతోషంగా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. దానికి ప్రభుత్వ వర్గాలే మమ్మల్ని సంప్రదించాలి."