పంజాబ్లోని హోసియార్పుర్లో భారతీయ జనతా పార్టీ నేత, పంజాబ్ మాజీ మంత్రి తీక్షణ్ సూద్ ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం ఆందోళనకు దిగారు. ట్రక్కులో పేడను తీసుకొచ్చి ఇంటి ముందు పారబోశారు. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం.. భాజపా కార్యకర్తలు తీక్షణ్ సూద్ ఆధ్వర్యంలో హోసియార్పుర్లోని జోదామల్ రహదారిపై ధర్నాకు దిగారు. అల్లరి మూకలే ఇలా చేశాయని, బాధ్యుల్ని గుర్తించి తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.