తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.3.46 అప్పు తీర్చేందుకు 15 కి.మీ. నడక - రూ.3.46 చెల్లించేందుకు 15 కి.మీ. నడిచి...

ఒక్క రూపాయైనా, వేల రూపాయలైనా అప్పు అప్పే. బ్యాంకు సిబ్బంది ఈ నియమాలను తప్పనిసరిగా పాటిస్తారు. ఇలాగే వారి నిబంధనల్ని అనుసరిస్తూ.. అక్షరాలా మూడు రూపాయల నలభై ఆరు పైసల బాకీ కోసం ఓ వ్యక్తికి ఫోన్​ చేసి మరీ బ్యాంకుకు రప్పించారు.

Farmer walked 15 km to repay 3 rupees 46 paise loan to Bank
రూ.3.46 చెల్లించేందుకు 15 కి.మీ. నడక

By

Published : Jun 29, 2020, 7:41 PM IST

వేలు కాదు, వందలూ కాదు.. కేవలం రూ. 3.46 అప్పు చెల్లించేందుకు ఓ వ్యక్తి ఏకంగా 15 కిలోమీటర్లు నడిచాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కర్ణాటక శివమొగ్గ జిల్లా నిట్టూర్​ ప్రాంతంలోని లక్ష్మీ నారాయణ అనే రైతు ఈ పని చేశారు.

ఎందుకంటే..

కెనరా బ్యాంక్​ నుంచి రూ. 35,000 రుణం తీసుకున్నారు అమాదే గ్రామవాసి లక్ష్మీ నారాయణ. ఇందులో రూ.32,000 రుణమాఫీ కాగా.. ఇప్పటికే రూ.3వేలు వడ్డీగా చెల్లించారు.

అయితే.. తక్షణమే రావాలని అతడికి బ్యాంక్​ నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంక్​ ఫోన్​ కదా అని అలసత్వం ప్రదర్శించకుండా అమాదే గ్రామం నుంచి నిట్టూర్​ బ్యాంకుకు వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లాక, అసలు విషయం తెలిసింది. మీరు ఇంకా బ్యాంకుకు రూ.3.46 చెల్లించాలని బ్యాంకు సిబ్బంది చెప్పగా.. నివ్వెరపోవడం లక్ష్మీ నారాయణ వంతైంది.

రూ.3.46 చెల్లించేందుకు 15 కి.మీ. నడక

అసంతృప్తితో..

బ్యాంకు బకాయి కట్టేటప్పుడు ఈ విషయం గురించి ప్రస్తావించలేదని చెప్పారు లక్ష్మీ నారాయణ. ఇదే విషయం ఫోన్​లోనే చెప్పి ఉంటే తన మిత్రుల ద్వారా చెల్లించేవాడినని బ్యాంకు సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:సీఎం ఇంటి ముందే యువకుడి ఆత్మాహుతి యత్నం

ABOUT THE AUTHOR

...view details