తెలంగాణ

telangana

ETV Bharat / bharat

31వ రోజుకు చేరిన అన్నదాతల ఆందోళన - కొత్త వ్యవసాయ చట్టాలు

నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతన్నలు చేస్తోన్న నిరసనలు 31వ రోజుకు చేరాయి. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్​ చేస్తూ దిల్లీ సరిహద్దుల్లో పెద్దఎత్తున ఉద్యమం చేపట్టారు అన్నదాతలు. మహిళా రైతులూ వీరికి మద్దతిస్తూ దీక్ష చేస్తున్నారు.

Farmer protests against the New farm laws have continued 31st day in Delhi Borders
31వ రోజుకు చేరిన అన్నదాత ఆందోళనలు

By

Published : Dec 26, 2020, 12:15 PM IST

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అన్నదాతలు చేపట్టిన ఆందోళనలు 31వ రోజుకు చేరుకున్నాయి. దిల్లీ సరిహద్దుల్లో రైతు నేతల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సింఘు, టిక్రి, ఘాజిపుర్, చిల్లా సరిహద్దుల వద్ద రైతులు బైఠాయించారు. వీరికి మద్దతుగా టిక్రి సరిహద్దు వద్ద మహిళా రైతులు దీక్ష చేపట్టారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ఆందోళన చేస్తున్న రైతుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అటు హరియాణాలో టోల్ రుసుములు చెల్లించనీయకుండా రైతులు అడ్డుకున్నారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు టోల్ రుసుముల చెల్లింపు నిరాకరించాలని రైతు నేతలు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:చర్చల పునరుద్ధరణపై నేడు రైతు సంఘాల కీలక భేటీ

ABOUT THE AUTHOR

...view details