సమస్యలను పరిష్కరించేందుకు ఆరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్రంతో భేటీ కావడానికి అంగీకరించారు రైతు సంఘాల నాయకులు. ఈ మేరకు అంగీకారం తెలుపుతూ కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శికి సంయుక్త కిసాన్ మోర్చా లేఖ రాసింది. నాలుగు అంశాలు ప్రధాన అజెండాగా బుధవారం(డిసెంబర్ 30న)చర్చలకు హాజరవుతున్నట్లు పునరుద్ఘాటించాయి రైతు సంఘాలు. తాము సూచించిన ప్రతిపాదనలు చర్చలో ఉండాలని లేఖలో స్పష్టం చేశారు నాయకులు.
'ఆ నాలుగు ప్రతిపాదనలు చర్చలో ఉండాల్సిందే' - famer protests
ఆరోసారి కేంద్రంతో చర్చించడానికి అంగీకరించిన రైతు సంఘాలు.. నాలుగు అంశాలు ప్రధాన అజెండాగా చర్చలకు హాజరవుతున్నట్లు వెల్లడించాయి. కేంద్ర వ్యవసాయ శాఖకు రాసిన లేఖలో ఈ విషయాన్ని పేర్కొన్నాయి.
'నాలుగు అజెండాలతో మరోసారి చర్చలకు సిద్ధం'
రైతు సంఘాల ప్రతిపాదనలు
- కొత్త సాగు చట్టాలను రద్దు చేసేందుకు విధివిధానాల రూపకల్పన
- రైతుల పంటకు కనీస మద్దతు ధర హామీకు చట్టబద్దత కల్పించడం
- దిల్లీ గాలి నాణ్యత ఆర్డినెన్స్ లో రైతులకు మినహాయింపు
- విద్యుత్ బిల్లు 2020ని వెనక్కి తీసుకోవడం
ఇదీ చూడండి:'ఈసారి చర్చలు విఫలమైతే రంగంలోకి దిగుతాం'
Last Updated : Dec 29, 2020, 10:13 PM IST