తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ సరిహద్దుల్లో మరో రైతు ఆత్మహత్య - రైతు నిరసన తాాజా వార్తలు

దిల్లీ సరిహద్దులో రైతలు చేస్తున్న ఆందోళనల్లో మరో కర్షకుడు ప్రాణాలు కోల్పోయాడు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు నిరసనల్లో పాల్గొంటున్న జై భగవాన్​ అనే రైతు.. విషపూరిత మాత్రలు తీసుకుని బలవన్మరణానికి యత్నించాడు. అనంతరం.. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు.

Farmer dies after consuming poisonous substance at Tikri border
దిల్లీ ఆందోళనల్లో విషమాత్రలు వేస్కుని రైతు ఆత్మహత్య

By

Published : Jan 20, 2021, 4:31 PM IST

Updated : Jan 20, 2021, 5:05 PM IST

సాగు చట్టాలను నిరసిస్తూ దిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తున్న రైతుల్లో బుధవారం ఓ కర్షకుడు మృతిచెందాడు. హరియాణాలోని రోహ్​తక్​ జిల్లా వాసి అయిన జై భగవాన్​ రాణా(42) మంగళవారం సల్ఫస్​ మాత్రలను తీసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అనంతరం అతడిని స్థానిక సంజయ్​ గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మరణించినట్టు పోలీసులు వెల్లడించారు.

తాను ఒక చిన్న రైతునని సూసైడ్​ నోట్​లో రాసుకొచ్చిన రాణా.. కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా అనేక మంది రైతులు వీధిన పడ్డారని పేర్కొన్నారు. 'ఇది కేవలం రెండు మూడు రాష్ట్రాల విషయమని ప్రభుత్వం చెబుతోంది. అయితే.. దేశంలోని రైతులంతా చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు. ఇది ఉద్యమం కాదు, పోరాటం. రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరుపుతున్నప్పటికీ ప్రతిష్ఠంభన మాత్రం వీడట్లేదు' అని లేఖలో రాశారు రాణా.

అయితే.. ఈ వ్యవహారంపై కోడ్​ ఆఫ్​ క్రిమినల్​ ప్రొసీజర్​(సీఆర్​పీసీ) కింద చట్టపరమైన చర్యలు చేపడతామని డిప్యూటీ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​(ఔటర్​) ఏ. కోవాన్​ తెలిపారు.

ఇదీ చదవండి:'సాగు చట్టాల' కమిటీపై అనుమానాలు- సుప్రీం అసహనం

Last Updated : Jan 20, 2021, 5:05 PM IST

ABOUT THE AUTHOR

...view details