యూపీఏ పాలన సమయంలో(2009-10) వ్యవసాయ రంగానికి రూ.12వేల కోట్లు కేటాయిస్తే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.లక్షా 34వేల కోట్లు కేటాయించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వర్ వెల్లడించారు. మోదీ రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు. క్యాపిటల్ మార్కెట్, కమాడిటీ మార్కెట్ 4వ వార్షిక సదస్సులో వర్చువల్గా పాల్గొన్నారు గంగ్వర్. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల ద్వారా దేశంలో ఎక్కడైనా రైతు తన పంటను అమ్ముకునే వీలు ఉందన్నారు. కనీస మద్దతు ధర కొనసాగుతుందని తెలిపారు.
'వ్యవసాయ రంగానికి నిధులు 11 రెట్లు పెంచాం' - santosh gangwar latest news
యూపీఏ హయాంతో పోలిస్తే మోదీ ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 11రెట్లు ఎక్కువ నిధులు కేటాయిస్తోందని కేంద్ర కార్మిక శాఖమంత్రి సంతోష్ గంగ్వర్ తెలిపారు. ఓ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన ఆయన కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు లాభం చేకూరుతుందని చెప్పారు.
!['వ్యవసాయ రంగానికి నిధులు 11 రెట్లు పెంచాం' Gangwar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9041591-955-9041591-1601765089811.jpg)
'కాంగ్రెస్తో పోలిస్తే 11రెట్లు వ్యవసాయరంగానికి కేటాయింపు'
ఇటీవల రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన కార్మిక చట్టాల్లోని సంస్కరణల గురించి ప్రస్తావించారు గంగ్వర్. కార్మికుల స్వావలంబనే లక్ష్యంగా ఈ సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. సులభతర వాణిజ్యానికి సైతం ఈ కార్మిక చట్టాలు దోహదపడతాయని తెలిపారు. భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించేందుకు వ్యాపార వేత్తలు కేంద్రానికి సహకరించాలని కోరారు.