తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త ఏడాదిలో ప్రయాణికులకు రైల్వే షాక్​.. ఛార్జీల పెంపు! - railway charges hight

రోడ్డు రవాణాలో ఛార్జీల మోతతో ప్రయాణికుల జెబులకు చిల్లు పడుతోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి కాస్త ఊరట కలిగించేది రైల్వేలే. తక్కువ ఛార్జీతో ప్రయాణం చేస్తుంటాం. అయితే.. వచ్చే ఏడాది రైల్వే శాఖ కూడా ఛార్జీలను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో నష్టాలను పూడ్చుకునేందుకు.. ఛార్జీల హేతుబద్దీకరణకు కసరత్తు ప్రారంభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్​ వినోద్​ కుమార్​ సూత్రప్రాయంగా వెల్లడించారు.

Fares, freight rates to be rationalised Rly Board chairman
కొత్త సంవత్సరంలో రైల్వే ఛార్జీల మోత!

By

Published : Dec 27, 2019, 5:20 AM IST

Updated : Dec 27, 2019, 6:44 AM IST

కొత్త ఏడాదిలో ప్రయాణికులకు రైల్వే షాక్​.. ఛార్జీల పెంపు!

కొత్త సంవత్సరంలో ప్రయాణికుల ఛార్జీలు పెంచేందుకు.. భారతీయ రైల్వే శాఖ సిద్ధమైంది. ఈ మేరకు సన్నాహాలు మొదలుపెట్టిన రైల్వే అధికారులు.. ఈ కసరత్తును రెండు రోజుల్లో ముగించి, ఛార్జీల పెంపుపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

ఈ విషయాన్ని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్​ కుమార్​ యాదవ్.. సూత్ర ప్రాయంగా వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రైల్వే ప్రయాణికులు, సరుకు రవాణా ఛార్జీలను హేతుబద్దీకరించబోతున్నట్లు ఆయన తెలిపారు. దానిపై సుధీర్ఘంగా చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు యాదవ్.

" రైల్వే ఛార్జీలను హేతుబద్దీకరించేందుకు కసరత్తు చేస్తున్నాం. అయితే.. ఛార్జీల పెంపు విషయంపై ఇప్పుడు నేను ఏమీ మాట్లడలేను. ప్రస్తుతం ఎక్కడ ఎక్కువ ఛార్జీలు ఉన్నాయో అక్కడ తగ్గించడం..తక్కువగా ఉన్నచోట పెంచటం వంటి చర్యలు చేపడతాం. చాలా కాలంగా ప్రయాణికుల ఛార్జీల పెంపు లేదు. ప్రస్తుతం మాంద్యం పరిస్థితుల్లో తమ ముందు ఇంతకుమించి మరో ప్రత్యామ్నాయం లేదు. రైళ్లలో ప్రయాణికుల సంఖ్యను పెంచడమే మా లక్ష్యం."

- వినోద్​ కుమార్​ యాదవ్​, రైల్వే బోర్డ్ ఛైర్మన్

తగ్గిన ఆదాయం..

ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఆర్థిక మాంద్యం ప్రభావం భారతీయ రైల్వేపైనా పడింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో ప్రయాణికుల పరంగా రూ.155 కోట్లు, సరుకు రవాణాలో రూ.3,901కోట్ల ఆదాయం తగ్గినట్లు ఆర్టీఐ నివేదికలో వెల్లడైంది. ప్రయాణ టికెట్ల ద్వారా రైల్వేకు మొదటి త్రైమాసికంలో రూ.13, 398.92కోట్ల ఆదాయం రాగా.. రెండో త్రైమాసికంలో అది రూ.13,243.81 కోట్లగా ఉంది. ఈ లోటును పూడ్చుకునేందుకే రైల్వే శాఖ ఛార్జీల పెంపుపై ఆలోచిస్తోంది.

Last Updated : Dec 27, 2019, 6:44 AM IST

ABOUT THE AUTHOR

...view details