ఫొని తుపాను మృతుల సంఖ్య ఒడిశాలో 64కు పెరిగింది. శనివారం వరకు మృతుల సంఖ్య 43 ఉండగా.. తుపాను కారణంగా మరో 21మంది మృతి చెందినట్టు గుర్తించామని ఒడిశా ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. అత్యధికంగా పూరీలో 39మంది చనిపోయారు.మే 3న ఒడిశాలో తీరం దాటిన ఫొని తుపాను ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది.
64మందిలో 25మంది గోడ కూలి చనిపోగా, 20మంది చెట్లు మీదపడి మృతి చెందారు. ఆరుగురు ఇంటి పైకప్పు కూలిన కారణంగా కన్నుమూశారు. మరో 13మంది మృతికి కారణాలు తెలియరాలేదు.