తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాలో 16కు చేరిన 'ఫొని' మృతుల సంఖ్య - రైల్వే స్టేషన్

ఒడిశాలో 'ఫొని' తుపాను సృష్టించిన విధ్వంసంలో మృతి చెందిన వారి సంఖ్య 16 కు చేరింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయకచర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రహదారుల వెంట పెద్దసంఖ్యలో కూలిన చెట్లను, విద్యుత్తు స్తంభాలను సహాయ సిబ్బంది తొలగిస్తున్నారు. తుపాను ధాటికి అతలాకుతలమైన భువనేశ్వర్‌ విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌లలో సేవలు పునరుద్ధరించారు.

ఫొని

By

Published : May 5, 2019, 7:38 AM IST

Updated : May 5, 2019, 8:43 AM IST

ఒడిశాలో 16కు చేరిన ఫొని మృతుల సంఖ్య

ప్రచండ వేగంతో మొన్న పూరీవద్ద తీరం దాటిన ఫొని తుపాను ధాటికి అస్తవ్యస్తమైన ఒడిశా తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తుపాను దాటికి రాష్ట్రవ్యాప్తంగా 16 మంది మృతి చెందినట్లు ఒడిశా సర్కార్‌ ప్రకటించింది.

మొత్తం పదివేల గ్రామాలు, 52 పట్టణాలపై తుపాను ఫొని ప్రభావం చూపింది. ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్​డీఆర్​ఎఫ్​, లక్ష మంది వివిధ శాఖల ఉద్యోగులు, 2వేల మంది అత్యవసర కార్మికులు, స్వచ్ఛంద సంస్థలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.

దాదాపు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఫొని తుపాను తీవ్రతకు రహదారులు, నివాస ప్రాంతాల్లో కూకటివేళ్లతో కూలిన భారీ వృక్షాలను భారీ యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. పెద్దసంఖ్యలో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలను పున: ప్రతిష్ఠించి విద్యుత్‌ సరఫరాను వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.

ఇప్పటికే భువనేశ్వర్‌ నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరించారు. భువనేశ్వర్‌ నుంచి దిల్లీకి అదనపు సర్వీసులు నడపనున్నట్లు ఎయిర్‌ఇండియా తెలిపింది. భువనేశ్వర్‌ రైల్వేస్టేషన్‌ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతుండగా అక్కడి నుంచి రైలు సేవలను పునరుద్ధరించారు.

Last Updated : May 5, 2019, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details