రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు 50 కిలోమీటర్ల దూరంలో, కుల్దారా ఖాభా రహదారిపై, డేఢా గ్రామంలో ఉన్న జసేరీ తాలాబ్ ఇది. స్థానిక చరిత్రకు నిదర్శనం. పరిసరాల్లోని 12 గ్రామాల దాహం తీరుస్తున్న ఈ చెరువును 400 ఏళ్ల క్రితం...జస్‌బాయి తండ్రి తవ్వించినట్లు స్థానికులు, చరిత్రకారులు చెప్తారు. ఆమె పేరుమీదుగానే ఈ చెరువుకు జసేరీ తాలాబ్ అనే పేరొచ్చింది.
"వివాహం తర్వాత జస్‌బాయి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, నీటికోసం ఎక్కడికి వెళ్లినా, పశువులకు నీరు తాగిస్తూ, ఎవరో ఒకరు ఉండేవారు. ఓసారి పిల్లలు ఇంట్లో ఎదురు చూస్తుండడం వల్ల ముందుగా తాను నీరు నింపుకుంటానని అడుగుతుంది జస్‌బాయి. అందుకు ఆయన ఒప్పుకోలేదు. చాలా సేపటి తర్వాత నీటితో ఇంటికి వెళ్లి, తన మరిదికి విషయం చెబితే... నీళ్లు కావాలంటే అలాగే ఎదురు చూడక తప్పదంటాడు మరిది. జస్‌బాయి తండ్రి వద్దకు వెళ్లి, పరిష్కారం కోరగా కుమార్తె కోసం ఏకంగా చెరువునే తవ్వించాడు ఆయన. జస్‌బాయి పేరుమీదుగా ఆ చెరువుకు జసేరీ తాలాబ్ అనే పేరొచ్చింది. చెరువు తవ్విన తర్వాత ఇంద్రభగవానుడు ఆశీస్సులు అందించగా వర్షం కూడా పడిందని చెబుతారు".
- విజయ్ బల్లానీ, చరిత్రకారుడు
జసేరీ చెరువు అంచున ఇత్తడి పొర పరిచినట్లు చెబుతారు స్థానికులు. తవ్విన నాటినుంచి, ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా చెరువు ఎండిపోలేదు. కొన్నేళ్ల క్రితం తీవ్రకరవు వచ్చినప్పుడు సైతం... చెరువులోని నీటిస్థాయి తగ్గినా....అడుగు మాత్రం కనిపించలేదు.