శైలేష్ పటేల్ కుటుంబం 40 ఏళ్ల క్రితం వ్యాపారం నిమిత్తం గుజరాత్ నుంచి అమెరికాకు వలస వెళ్లి.. అక్కడే స్థిరపడింది. అయితే తమకు మంచి జీవితాన్నిచ్చిన దేశ అధ్యక్షుడు ట్రంప్ ఈనెల 24న భారత్‌కు వస్తున్నారని తెలుసుకున్నారు. ఆయన కోసం నిర్వహించే 'నమస్తే ట్రంప్' కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. ఆ కార్యక్రమాన్ని తిలకించేందుకు వెంటనే భారత్ చేరుకుంది ఆ కుటుంబం.
'నమస్తే ట్రంప్' కోసం అమెరికా నుంచి గుజరాత్‌కు - donald trump
40 ఏళ్ల క్రితం అమెరికాకు వలస వెళ్లిందో గుజరాతీ కుటుంబం. తమకు జీవితాన్ని ఇచ్చిన దేశ అధ్యక్షుడు సొంత ప్రాంతానికి వస్తున్నారన్న కారణంతో హుటాహుటిన గుజరాత్‌కు వచ్చింది. 'నమస్తే ట్రంప్' కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
'నమస్తే ట్రంప్' కోసం అమెరికా నుంచి గుజరాత్‌కు..
ప్రస్తుతం శైలేష్ కుటుంబం సూరత్‌లో ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో గత కొన్నేళ్లుగా వీరికి సన్నిహిత సంబంధాలున్నాయి. రెండోసారి మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయన్ను శైలేష్ కుటుంబం కలిసింది. ట్రంప్ భారత్ పర్యటనతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు శైలేశ్ కుటుంబసభ్యులు.
ఇదీ చదవండి:ఉత్తరప్రదేశ్‌లో బయటపడ్డ టన్నులకొద్దీ పసిడి!
Last Updated : Mar 2, 2020, 3:49 AM IST