తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దళపతి విజయ్​ ఇంటికి బాంబు బెదిరింపు - నటుడు విజయ్​ నివాసానికి బాంబు బెదిరింపు

తమిళనాడు సాలిగ్రామంలో ఉన్న స్టార్​ హీరో దళపతి విజయ్​ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్​ కాల్​ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు.. విజయ్​ నివాసాన్ని తనిఖీ చేశారు. చివరకు అది ఫేక్​ కాల్​ అని నిర్ధరించారు. ఆ ఫోన్​ చేసిన వ్యక్తిని 21ఏళ్ల విల్లుపురంవాసిగా పోలీసులు గుర్తించారు. అతడిలో సైకో లక్షణాలు కనిపించినట్టు వెల్లడించారు.

Fake bomb threat issued to Actor Vijay Home: Police trace caller to Villupuram
దళపతి విజయ్​ నివాసానికి బాంబు బెదిరింపు

By

Published : Jul 5, 2020, 5:20 PM IST

Updated : Jul 5, 2020, 5:26 PM IST

ప్రముఖ తమిళ నటుడు దళపతి విజయ్​ నివాసానికి శనివారం రాత్రి బాంబు బెదిరింపు ఫోన్​ కాల్​ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు.. విజయ్​ ఇంటిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. చివరకు అది ఫేక్ కాల్​ అని తేల్చారు. అనంతరం నకిలీ బాంబు బెదిరింపునకు పాల్పడిన వ్యక్తిని.. విల్లుపురంలోని మరక్కనమ్​కు చెందిన 21ఏళ్ల వ్యక్తిగా గుర్తించారు.

సైకో లక్షణాలు...

నిందితుడికి సైకో లక్షణాలు ఉన్నాయని, అతడు మానసికంగా అనారోగ్యంతో ఉన్నట్టు చెప్పారు పోలీసులు. అతడికి సొంతంగా ఫోన్​ లేకపోయినప్పటికీ.. కుటుంబ సభ్యుల మొబైల్​ నుంచి కాల్​ చేసినట్టు వెల్లడించారు. అతడి వైద్య నివేదికలు చూసిన అనంతరం పోలీసులు ఆ వ్యక్తిని వదిలేశారు.

గతంలోనూ ఆ 21 ఏళ్ల వ్యక్తి ఇదే విధంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, గవర్నర్​ కిరణ్​ బేడీకి కాల్​ చేసినట్టు పోలీసులు తెలిపారు.

జూన్​ 19న చెన్నైలోని రజినీకాంత్​ నివాసానికి కూడా ఇదే విధంగా ఓ ఫోన్​ కాల్​ వచ్చింది. అయితే కరోనా వైరస్​ నేపథ్యంలో బాంబు స్క్వాడ్​ను లోపలకి రానివ్వలేదు. చివరకు అది కూడా ఫేక్​ కాల్​ అని తేలింది.

Last Updated : Jul 5, 2020, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details