కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన నేపథ్యంలో జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లలో అంతర్జాలాన్ని నిలిపివేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలన్నీ వదంతులేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.
ఈ విషయంపై అమిత్ షా పేరుతో తప్పుడు ట్వీట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నట్లు హోంశాఖ ప్రతినిధి వెల్లడించారు. రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఫిక్స్డ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయనున్నట్లు అందులో ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ ట్వీట్ పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.
"ఈ ట్వీట్ ఫేక్. కేంద్ర హోంమంత్రి తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి అలాంటి ట్వీట్ చేయలేదు."