ఇమామీ సంస్థ ఉత్పత్తుల టీవీ వాణిజ్య ప్రకటనలు హిందుస్థాన్ యూనిలివర్ ప్రైవేటు లిమిటెడ్(హెచ్యూఎల్) ఉత్పత్తులను కించపరిచే విధంగా లేవని దిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది.
ప్రత్యేకంగా పురుషుల కోసం ఇమామీ సంస్థ రూపొందించిన 'ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్' టీవీ వాణిజ్య ప్రకటన 'ఫెయిర్ అండ్ లవ్లీ'ని అవమానపరిచే విధంగా ఉందని దిల్లీ కోర్టులో మధ్యంతర వ్యాజ్యం దాఖలు చేసింది హెచ్యూఎల్. ఇమామీ టీవీ ప్రకటనలను తక్షణమే నిషేధించాలని అభ్యర్థనలో పేర్కొంది.
ఇమామీ టీవీ వాణిజ్య ప్రకటనలో హెచ్యూఎల్ ఉత్పత్తులను చులకన చేసి చూపే విషయాలేమీ లేవని అభిప్రాయపడుతున్నట్లు కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జయంత్ నాథ్ తెలిపారు.