మహారాష్ట్రలో అత్యంత తక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్ చరిత్రకెక్కారు.
59 ఏళ్ల మహారాష్ట్ర రాజకీయాల్లో కేవలం 4 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఫడణవీస్. పూర్తి మెజారిటీ లేకున్నా ఎన్సీపీ నేత అజిత్ పవార్ సహకారంతో అనూహ్య రీతిలో నవంబర్ 23న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వరుస పరిణామాల నేపథ్యంలో అజిత్ పవార్ వెనకడుగు వేయటం వల్ల నాలుగో రోజే ఫడణవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది.