తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్​ఎస్​ఎస్​ అధినేతతో ఫడణవీస్​ భేటీ

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటుపై స్పష్టత రావటం లేదు. పరిపాలన విషయంలో భాజపా-శివసేన మధ్య ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో.. రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భగవత్​తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

ఆర్​ఎస్​ఎస్​ అధినేతతో ఫడణవీస్​ భేటీ

By

Published : Nov 6, 2019, 5:21 AM IST

Updated : Nov 6, 2019, 8:03 AM IST

ఆర్​ఎస్​ఎస్​ అధినేతతో ఫడణవీస్​ భేటీ

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​.. రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​) అధినేత​ మోహన్​ భగవత్​తో భేటీ అయ్యారు.

నాగ్​పుర్​ మహల్​ ప్రాంతంలోని ఆర్​ఎస్​ఎస్​ ప్రధాన కార్యాలయానికి మంగళవారం రాత్రి చేరుకున్న ఫడణవీస్​ సుమారు గంటన్నరపాటు భగవత్​తో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య జరిగిన సంభాషణపై ఎలాంటి స్పష్టత లేనప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల అనంతరం నెలకొన్న రాజకీయ అనిశ్చితిపైనే చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అంతకుముందు రాష్ట్ర భాజపా సీనియర్​ నేత, ఆర్థిక మంత్రి సుధీర్​ ముంగంటివార్​.. ప్రభుత్వ ఏర్పాటుపై అతి త్వరలో శుభవార్త వింటారని పేర్కొన్నారు. ఏ క్షణంలోనైనా ప్రభుత్వం ఏర్పాటు కావచ్చని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ భగవత్​తో ఫడణవీస్​ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

పట్టు వీడని సేన..

భాజపా ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేపట్టినప్పటికీ.. భాగసామ్య పార్టీ శివసేన చెరిసగం పాలన (50:50 ఫార్ములా)పై పట్టు వీడటం లేదు. భాజపా నుంచి లిఖితపూర్వక హామీ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు ఆ పార్టీ ఎంపీ సంజయ్​ రౌత్​. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి సేన నుంచే ఉంటారని ఉద్ఘాటించారు.

ఇదీ చూడండి: శుభవార్త అంటున్న భాజపా- వెనక్కి తగ్గని సేన

Last Updated : Nov 6, 2019, 8:03 AM IST

ABOUT THE AUTHOR

...view details