తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆ రూ.40 వేల కోట్ల కోసమే భాజపా 'మహా' డ్రామా!'

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా సంఖ్యాబలం లేదని తెలిసినా భాజపా ఎందుకు అధికారం చేపట్టింది? 'దేవేంద్ర 2.0' కథ 80 గంటల్లోనే ఎందుకు ముగిసింది? ఆ కొద్ది సమయంలోనే తెరవెనుక ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు భాజపా ఎంపీ అనంత కుమార్ హెగ్డే ఇచ్చిన సమాధానం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Fadnavis
ఆ 40వేల కోట్ల కోసమే భాజపా 'మహా' డ్రామా!

By

Published : Dec 2, 2019, 11:15 AM IST

మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్​ రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటంపై కీలక వ్యాఖ్యలు చేశారు భాజపా ఎంపీ అనంత కుమార్​ హెగ్డే. ప్రభుత్వానికి కావాల్సిన మెజారిటీ లేదని తెలిసినా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టటం వెనుక ఓ పెద్ద కథ ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన రూ.40వేల కోట్లను కాపాడేందుకు డ్రామా చేపట్టినట్లు స్పష్టం చేశారు. అందుకోసమే ఎవరికీ తెలియకుండా.. కోడి కూయకముందే ముఖ్యమంత్రిగా ఫడణవీస్​ ప్రమాణం చేసినట్లు తెలిపారు అనంత కుమార్.

కర్ణాటక ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు అనంత కుమార్​.

" మీ అందరికీ తెలుసు మా పార్టీ నేత ఫడణవీస్​ మహారాష్ట్రలో కేవలం 80 గంటలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. ఈ డ్రామా మేము ఎందుకు చేశామని అనుకుంటున్నారా? మాకు మెజారిటీ లేదని తెలిసి, ఆయన ఎందుకు సీఎం అయ్యారు? అని ప్రతి ఒక్కరు అడికే సాధారణ ప్రశ్న ఇది.

రూ.40వేల కోట్లకుపైగా నిధులు ముఖ్యమంత్రి అధీనంలో ఉన్నాయి. ఒకవేళ ఎన్సీపీ, కాంగ్రెస్​, శివసేన కూటమి అధికారంలోకి వస్తే ఆ నగదును అభివృద్ధి కోసం ఖర్చు చేయదు. ఇతర వాటి కోసం వినియోగిస్తుంది. అందుకే ముఖ్యమంత్రిగా పదవి చేపట్టాలని ముందుగానే ప్రణాళిక చేశాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిసినప్పుడే ఈ డ్రామా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అన్ని విధాలా సర్దుబాట్లు జరిగాయి. ఫడణవీస్​ సీఎంగా ప్రమాణం చేశారు. ప్రమాణం చేసిన 15 గంటల్లోనే ఆ రూ. 40వేల కోట్లు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చారు. "

- అనంత కుమార్​ హెగ్దే, భాజపా ఎంపీ.

ABOUT THE AUTHOR

...view details