తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాజీ సీఎంను ఎగతాళి చేస్తూ శివసైనికుల నినాదాలు - devendra fadnavis news

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో విభేదాలతో భాజపా-శివసేన మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఈ క్రమంలో శివసేన వ్యవస్థాపకుడు బాల్​ఠాక్రే వర్ధంతికి నివాళులర్పించేందుకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు చేదు అనుభవం ఎదురైంది.  ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు శివసేన కార్యకర్తలు.

మాజీ సీఎంను ఎగతాళి చేస్తూ శివసైనికుల నినాదాలు

By

Published : Nov 17, 2019, 4:34 PM IST

మాజీ సీఎంను ఎగతాళి చేస్తూ శివసైనికుల నినాదాలు

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు శివసేన వ్యవస్థాపకుడు బాల్​ఠాక్రే వర్ధంతి కార్యక్రమంలో చేదు అనుభవం ఎదురైంది. ఠాక్రేకు నివాళులర్పించి తిరిగి వెళుతుండగా శివసేన కార్యకర్తలు ఎగతాళి చేస్తూ ఫడణవీస్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వం ఎవరిది? శివసేనది..

నేడు శివసేన వ్యవస్థాపకుడు బాల్​ ఠాక్రే 9వ వర్ధంతి. ఈ సందర్భంగా ముంబయిలోని శివాజీ పార్క్​లో ఆయనకు నివాళులర్పించారు ఫడణవీస్​. అక్కడి నుంచి తిరిగి వెళుతుండగా ఆయన కాన్వాయ్​కు సమీపంలో ఉన్న కొంతమంది శివసేన కార్యకర్తలు అసెంబ్లీ ఎన్నికల్లో ఫడణవీస్​ చెప్పిన మాటలను ఉటంకిస్తూ ఎద్దేవా చేశారు. 'ఎన్నికల అనంతరం సీఎంగా తిరిగి బాధ్యతలు చేపడతా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం.. అన్నారు ఎవరు? ప్రభుత్వం ఎవరిది? శివసేనది' అంటూ మరాఠీలో నినాదాలు చేశారు. వాటితోపాటు 'ఛత్రపతి శివాజీ మహరాజ్​కు జై' అంటూ నినదించారు.

శివసేన కార్యకర్తలు నినాదాలు చేస్తున్నప్పటికీ ఫడణవీస్​ సహా ఆయనతో ఉన్న భాజపా సీనియర్​ నేతలు, నాయకులు స్పందించకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.

శివసేన అగ్రనాయకులు దూరం..

బాల్​ఠాక్రే వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు ఫడణవీస్​ వచ్చిన సమయంలో శివసేన నాయకులెవరూ అక్కడ లేరు. ఉద్ధవ్​ ఠాక్రే పీఏ మిలింద్​ నర్వేకర్​ ఒక్కరే ఉన్నారు.

ఇదీ చూడండి: అబ్దుల్లా నిర్బంధంపై అఖిలపక్ష భేటీలో విపక్షాలు గరం

ABOUT THE AUTHOR

...view details