సెప్టెంబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు, అక్టోబర్ 1 నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నట్లు వెలువడుతున్న వస్తున్న మీడియా కథనాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఖండించింది. అవి తప్పుడు వార్తలని వివరణ ఇచ్చింది.
అలాంటిదేమీ లేదు..
'దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 25 నుంచి 46 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ వించిధించాలి.' అని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్ఎండీఏ), ప్రణాళిక సంఘం.. ప్రధాన మంత్రి కార్యాలయానికి సూచించినట్లు వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వార్తలు అవస్తవమని పీఐబీ తెలిపింది. ఎన్ఎండీఏ అలాంటి ఆదేశాలేవి ఇవ్వలేదని స్పష్టం చేసింది.