తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎట్టకేలకు గాడినపడ్డ వాట్సాప్​, ఇన్​స్టా - వాట్సాప్​

తమ యాప్​లు పూర్తి స్థాయిలో పని చేస్తున్నట్టు సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ ప్రకటించింది. ఫేస్​బుక్​, వాట్సాప్​, ఇన్​స్టాగ్రామ్​లో ఫొటో షేరింగ్​, డౌన్​లోడింగ్​లో బుధవారం సమస్యలు ఎదురయ్యాయి. 12 గంటల తర్వాత ఈ సమస్యను పరిష్కరించారు.

ఎట్టకేలకు గాడినపడ్డ వాట్సాప్​, ఇన్​స్టా

By

Published : Jul 4, 2019, 11:18 AM IST

ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​, వాట్సాప్​ పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​ ప్రకటించింది. వినియోగదారుల అసౌకర్యానికి చింతిస్తున్నట్టు తెలిపింది.

భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా వీటి సేవలకు బుధవారం అంతరాయం కలిగింది. డేటా డౌన్​లోడింగ్​, షేరింగ్​లో సమస్యలు తలెత్తాయి. వీటిని పరిష్కరించడానికి దాదాపు 12 గంటల సమయం పట్టింది.

ఈ విషయంపై వినియోగదారులు సామాజిక మాధ్యమాల వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. 'వాట్సాప్​డౌన్, ఇన్​స్టాగ్రామ్​డౌన్​' హ్యాష్​ట్యాగ్​తో​ పోస్ట్​ చేశారు.

ఇదీ చూడండి:- 'నా అన్నలా చేయాలంటే ధైర్యం కావాలి'

ABOUT THE AUTHOR

...view details