తమిళనాడు తంజావూరు జిల్లా కుంభకోణానికి చెందిన వసంతన్ పీహెచ్డీ పూర్తి చేయడానికి ఏడేళ్ల క్రితం జపాన్‌కు వెళ్లాడు. చదువు పూర్తి చేసి అక్కడే శాస్త్రవేత్తగా ఉద్యోగం సంపాదించాడు. ఆ సమయంలోనే న్యాయవాది మెకుమీతో పరిచయం ఏర్పడింది. ఫేస్బుక్లో వారిద్దరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారింది. పెళ్లితో ఒక్కటవ్వాలని నిర్ణయించుకుని.. పెద్దలను ఒప్పించారు. మెకుమీ కోరిక మేరకు హిందూ సంప్రదాయంలో మూడుముళ్లు వేశాడు వసంతన్.
ఇరు కుటుంబాల పెద్దలు ఈ నూతన వధూవరులను దీవించారు. కొన్ని పరిస్థితుల కారణంగా మెకుమీ తల్లిదండ్రులు పెళ్లికి హాజరుకాలేకపోయారు. ఆమె మేనమామ బాధ్యతలు స్వీకరించి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. జపాన్ పెళ్లికూతురు భారత కట్టుబొట్టులో బుట్టబొమ్మలా మురిసిపోయింది. ఇక మెకుమీ బంధువులు సైతం హిందూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిశారు.