తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆన్​లైన్​కొస్తే ప్రేమ పుట్టింది.. ఇంటికొస్తే పెళ్లైపోయింది!

ఎరక్కపోయి ఇరుక్కుపోయింది ఆ ఫేస్​బుక్ ప్రేమ జంట. చాటింగ్​ బోర్​ కొట్టి అమ్మాయిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు ఆ అబ్బాయి. కానీ, అమ్మాయి కుటుంబసభ్యులకు అడ్డంగా దొరికిపోయాడు. సరదాగా ఇంటికి వచ్చిన అబ్బాయిని ఇంటికి అల్లుడిని చేసేసుకున్నారు. ప్రేమ పేరుతో చేసే కాలక్షేపానికి అడ్డుకట్ట​ వేశారు. బాధ్యత తెలిసొచ్చేలా మెడలు వంచి తాళి కట్టించేశారు.

ఆన్​లైన్​కొస్తే ప్రేమ పుట్టింది.. ఇంటికొస్తే పెళ్లైపోయింది!

By

Published : Sep 14, 2019, 12:50 PM IST

Updated : Sep 30, 2019, 1:50 PM IST

ఆన్​లైన్​కొస్తే ప్రేమ పుట్టింది.. ఇంటికొస్తే పెళ్లైపోయింది!
ఫేస్​బుక్​లో చిగురించిన ప్రేమకు బలవంతంగా శుభం కార్డు పడింది. పెద్దల కంటపడి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.ఒడిశా బాలేశ్వర్​ జిల్లా మణిపుర్​ సోరోలోని గులునియా గ్రామానికి చెందిన సురేంద్ర బెహెరా కుమార్తె, కుబబుపాట్న గ్రామానికి చెందిన బైకుంటకు ఫేస్​బుక్​లో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులు చాటింగ్​లోనే ప్రేమాయాణం నడిపారు. తర్వాత ఫోన్​ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని కాస్త దగ్గరయ్యారు. కొద్ది రోజులుగా వీరిద్దరు కలుసుకోవాలని అనుకుంటున్నారు.

గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేరని సందేశం పంపింది అమ్మాయి. ఎట్టకేలకు ప్రియసఖిని ఏకాంతంగా కలిసే అవకాశం వచ్చిందని ఉత్సాహంగా వచ్చాడు బైకుంట. కానీ, అతడు ఇంట్లోకి వెళ్తున్న సంగతి గమనించిన చుట్టు పక్కల వారు ఈ విషయాన్ని అమ్మాయి తల్లి చెవిలో వేశారు.

ఇంకేముంది.. ప్రేమ మాటల్లో మునిగి ఉన్న ఇద్దరూ రెడ్​ హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. మీ ప్రేమ నిజమే అయితే ఇప్పుడే పెళ్లి చేసుకోవాలంటూ గ్రామస్థులంతా కలిసి బలవంతంగా పెళ్లి చేశారు.

ఇదీ చూడండి:37 ఏళ్ల తర్వాత భారత్​కు తిరిగొచ్చిన 'నటరాజు'..!

Last Updated : Sep 30, 2019, 1:50 PM IST

ABOUT THE AUTHOR

...view details