తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటకకు ఉగ్రముప్పు​- భద్రత కట్టుదిట్టం - ఉగ్రముప్పు​

ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల మేరకు కర్ణాటకలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. అనుమానిత ప్రాంతాల్లో మెటల్​ డిటెక్టర్స్​, స్నిఫర్​ డాగ్స్​తో తనిఖీలు చేపట్టారు.

కర్ణాటకకు ఉగ్రముప్పు​- భద్రత కట్టుదిట్టం

By

Published : Aug 17, 2019, 7:49 PM IST

Updated : Sep 27, 2019, 7:57 AM IST

కర్ణాటకకు ఉగ్రముప్పు​- భద్రత కట్టుదిట్టం
కర్ణాటకలోని ప్రధాన నగరాలు, పట్ణణాలు సహా పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు అధికారులు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మెటల్​ డిటెక్టర్స్, స్నిఫర్​ డాగ్స్​తో అణువణువునా గాలిస్తున్నారు.

కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు హుబ్లీ-ధార్వాడ్​, కలబురగి, రాయ్​చుర్​, చిత్రదుర్గ, మంగళూరు, దవాంగీర్​, ఉడుపి, మైసూర్​, తుమకూరు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు.

ఉగ్రవాద బృందాలు దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు దిగి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయని అధికారులు తెలిపారు.

తనిఖీల సందర్భంగా మంగళూరులో ఎనిమిది మంది దోపిడీ దొంగలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి రెండు తుపాకులు, ఎనిమిది కార్​ట్రిడ్జ్​లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: రెండో పెళ్లి వద్దన్నారని 75ఏళ్ల వరుడి ఆత్మహత్య

Last Updated : Sep 27, 2019, 7:57 AM IST

ABOUT THE AUTHOR

...view details