తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పేదల సంక్షేమమే మోదీకి పరమావధి'

దేశంలోని పేద ప్రజలకు మేలు కలిగేలా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో ఐదు నెలలు పొడిగించడంపై భాజపా నేతలు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని దూర దృష్టికి ఈ చర్య నిదర్శనమని అన్నారు. ఈ విషయంలో మోదీని అభినందించాలని పేర్కొన్నారు.

PMGKAY
'పేదల సంక్షేమానికి మోదీ కట్టుబడి ఉన్నారు'

By

Published : Jun 30, 2020, 6:32 PM IST

పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన(పీఎంజీకేవై)ను మరో ఐదు నెలలు పొడిగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను భాజపా నేతలు స్వాగతించారు. పేద ప్రజల సంక్షేమానికి ప్రధాని మోదీ కట్టుబడి ఉన్నారని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. పీఎంజీకేవై పథకాన్ని పొడిగించడం ఇందుకు నిదర్శనమని చెప్పారు.

కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న పరిస్థితుల్లో దేశాన్ని అప్రమత్తతతో దేశాన్ని నడిపిస్తున్నారని మోదీకి కితాబిచ్చారు నడ్డా. ఈ సమయంలో ప్రజల జీవితాలను కాపాడుతున్నందుకు ప్రధానమంత్రిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.

"80 కోట్ల మంది పేద ప్రజలకు చేయూతనిచ్చేలా 'పీఎంజీకేఏవై'ని మరో ఐదు నెలలు పొడిగించడం ప్రధాని దూరదృష్టికి నిదర్శనం. దీనిని స్వాగతిస్తున్నాం. పేదల అభ్యున్నతి పట్ల ప్రధాని నిబద్ధతను ఈ చర్య ప్రతిబింబిస్తోంది."

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

ప్రపంచంలోనే లేదు

దేశంలోని ఏ ఒక్క వ్యక్తి ఆకలితో బాధపడరాదన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి చర్యలు తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు మోదీని అభినందించాలని అన్నారు జావడేకర్.

"80 కోట్లమంది ప్రజలు.. అంటే దాదాపు 16 కోట్ల కుటుంబాలు వచ్చే ఐదు నెలల్లో 25 కిలోల ఆహార ధాన్యాలను ఉచితంగా పొందుతారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఇలాంటి ఆహార భద్రత పథకం లేదు. ఈ పథకం ద్వారా అందరికీ ఆహారం అందుతుంది."

-ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి

ప్రధాని ప్రకటన

జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో "ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన"ను నవంబర్​ చివరి వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించారు ప్రధాని మోదీ. ఈ నిర్ణయంతో 80కోట్ల మంది ప్రజలు లబ్ధిపొందుతారని స్పష్టం చేశారు. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యం, గోధుమలు అందుతాయని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం రూ.90వేల కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. గత మూడు నెల ఖర్చులతో కలిపి ఈ పథకానికి రూ. 1.5లక్షల కోట్లను ఖర్చుచేస్తున్నట్లు వివరించారు ప్రధాని.

ఇదీ చదవండి-'మరో 5 నెలలు ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ'

ABOUT THE AUTHOR

...view details